20111025

బంగారు బుల్లెమ్మా



ఓ బుల్లెమ్మా,
కనులు తెరిస్తే, నువ్వు నవ్వితే నీ బుగ్గన పడే సొట్టలే
కనులు మూస్తే నీ నల్లని కురులు, చేక్కిల్లు, నీ కన్నులే
నిను చేరాలనే కోరికే పెరుగుతుంది ఓ లావాలా లోలోపల
అనచాలనే ఆలోచనలో పడుతున్న ఇబ్బంది వెలుపల
నీ స్వరం వినిపించే నా సెల్ ఫోన్ రింగు కోసం కాచుకు కూర్చున్నా
నువ్వు తిట్టే తిట్లకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా
కలలో నువ్వు వేసే మొట్టికాయల కోసమే నిదురిస్తున్నా
నీకోసం ఓ పాటే పాడాలని,
నీకన్నుల్లో ఓ నవ్వె చూడాలని
నీ చెవిలో ఉఫ్ఫ్మని ఊదాలని
నీ చేతికి గాజులే తొడగాలని
నీ మెప్పు కోసం ఎన్నో ఎన్నెన్నో చేయాలని నా మనసే ఆత్ర పడుతుంది,  బంగారం....

8 కామెంట్‌లు:

  1. బాగుందండీ,

    సెల్ ఫొన్ తో మమేకమై
    మీరు లాపు, టాపూ తో కూడి
    చుక్కల పల్లకీ లో
    బంగరు బుల్లెమ్మ
    తొ హాయి హాయి గా షికారు చేస్తారని ఆశిస్తూ

    రిప్లయితొలగించండి
  2. Zilebi గారు :)
    ధన్యుడనైతి మీ వ్యఖ్య చూసి...

    రిప్లయితొలగించండి
  3. mee kavitha punyama ani tvaralo meeu ee
    http://www.youtube.com/watch?v=3HRwesVcPME
    good news chustharu
    mee bangaram gonthulo

    రిప్లయితొలగించండి
  4. తథాస్తు దేవతలు..ఎక్కడున్నా వచ్చేసి ఈ బుల్లోడిని దీవించేయండి.... :)

    రిప్లయితొలగించండి