20111025

బంగారు బుల్లెమ్మా



ఓ బుల్లెమ్మా,
కనులు తెరిస్తే, నువ్వు నవ్వితే నీ బుగ్గన పడే సొట్టలే
కనులు మూస్తే నీ నల్లని కురులు, చేక్కిల్లు, నీ కన్నులే
నిను చేరాలనే కోరికే పెరుగుతుంది ఓ లావాలా లోలోపల
అనచాలనే ఆలోచనలో పడుతున్న ఇబ్బంది వెలుపల
నీ స్వరం వినిపించే నా సెల్ ఫోన్ రింగు కోసం కాచుకు కూర్చున్నా
నువ్వు తిట్టే తిట్లకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా
కలలో నువ్వు వేసే మొట్టికాయల కోసమే నిదురిస్తున్నా
నీకోసం ఓ పాటే పాడాలని,
నీకన్నుల్లో ఓ నవ్వె చూడాలని
నీ చెవిలో ఉఫ్ఫ్మని ఊదాలని
నీ చేతికి గాజులే తొడగాలని
నీ మెప్పు కోసం ఎన్నో ఎన్నెన్నో చేయాలని నా మనసే ఆత్ర పడుతుంది,  బంగారం....

20111012

నువ్విలా పాటలు డౌన్లోడ్

ఇక్కడ నేను పైరేటెడ్ పాటలు డౌన్లోడ్ చేసుకోమని లంకె ఇవ్వడం లేదు.


నాకు ఎప్పట్నుంచో ఉన్న ఐడియా ని ఇలా ఉషాకిరణ్ మూవీస్ వారికి కూడా వచ్చినందుకు ఆనన్దపదుతూ ఈ టపా వేస్తున్నాను.

నేను హైదరాబాదులో ఉండగా, పాటల సీడీని కొని పాటలు రిప్ చేసుకునే వాడిని. బెంగుళూరు వచ్చిన తరవాత కొనే చోటు దొరికేది కాదు. ఇంకా రాగ డాట్ కాం లో వినేవాడిని. కొన్ని డౌన్లోడ్ చేసుకునే వాడిని వేరే సౌర్చెస్ నుంచి. అపుడప్పుడు అనుకున్తూ ఉండే వాడిని, సినిమా పాటలు విడుదల చేసినప్పుడు పాటకి రూపాయో రెండు రూపాయలో ఖరీదు పెట్టి, డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కలిగించి ఉంటే బాగుంటుంది కదా, ఇలా పైరేట్ చేయడం తగ్గుతుంది అనుకునే వాడిని. ఇన్నాళ్ళకు ఉష కిరణ్ మూవీస్ వారు, నువ్విల పాటలు అన్నిటిని ఇరవై రూపాయలకి డౌన్లోడ్ చేసుకునే వీలును కలిపించినందుకు ఆనందపడుతూ డౌన్లోడ్ చేసుకున్నాను.


ఈ పాటలని నువ్విలా సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.