20100820

కత్తి; వైజాగ్ కత్తి; ఏడ్చే రకం కాదు; ఏడిపించే రకం

సై ఆట చిత్రం సమీక్ష


గమనిక: ఇది చదివి నన్ను తిట్టొద్దు.


నా జీవితం లో ఇంత కామెడీగా ఏ సినిమాని చూడలేదు. బాల్కనీ లో వెల్ల మీద లెక్క వెయ్యడం కూడా దండగ; ఇద్దరం.
దయ చేసి ఎవరు వెళ్ళకండి


కథకి వస్తే, శంకర్ బాబాయ్(కోట) పండిట్(శివ ప్రసాద్) శత్రువులు, ఒకరి మనుషుల్ని ఒకరు చంపుకుంటూ ఉంటారు.
దుర్గ మల్లేశ్వరి - వైజాగ్ కత్తి(చార్మి) డాన్సు చొరెఒగ్రఫెర్ పిల్లల్ని వేసుకుని ఓంకార్ గాడి ఆట షో లో పర్తిసిపతే చేయడానికి వస్తుంది.  ఓంకార్ వాళ్ళకోసం ఒక ఇంటిని చూస్తాడు, ఆ ఇంటి పక్కనే శంకర్ బాబాయ్ మనుషులతో గొడవ పడి శంకర్ బాబాయ్ ఇంటికి వెళ్లి ఆ విషయం చెప్పి ఆ శంకర్ బాబాయ్ ఇంటిలోనే  డాన్సు ప్రాక్టీసు చేయడం మొదలు పెడుతుంది. అలాగే గొడవల్లో పండిట్ మనుషులతో కూడా గొడవ పడుతుంది. ఎలాగో మొత్తం మీద శంకర్ బాబాయ్ వలలో పడి, తనతో వచ్చిన పిల్లల్ని ఎరగా చూపి పండిట్ కొడుకుని(పండ- అజయ్)ని చంపమంటాడు.


తప్పక చంపేస్తుంది పండ ని. మల్లి ఇక్కడ శంకర్ బాబాయ్ ఆ పండిట్ ని కూడా చంపేయి అంటాడు. ఆ పండిట్ ని పట్టుకుని బంధించి శంకర్ బాబాయ్ కి ఫోన్ చేసి నీ చేతులతో నువ్వే చంపు అని ఒక్కడినే రమ్మని, పిల్లల్ని వదిలేయాలి అని చెబుతుంది. అలాగే చేస్తాడు శంకర్ బాబాయ్. అప్పుడు ఒక సొల్లు ఫ్లశ్బచ్క్ చెప్పి పగ తీచుకుంటుంది మన దుర్గ మల్లేశ్వరి. చచ్చే రకం కాదు చంపే రకం.
చూసి నేను ఏడ్చా చచ్చ.


దేవిశ్రీ ప్రసాద్ పాటల్ని ఎవరికో ఔత్సౌర్స్ చేసినట్టున్నాడు. కామెర వర్క్ అసలా బాలేదు. కామెడీ, అది నిల్లు. విజువల్ ఎఫ్ఫెక్ట్స్ అసలా బాలేదు.


ఈ సినిమాకి రేటింగ్  ఇవ్వడం కూడా అనవసరం. హాల్ లో కాదు, సీడీ లో కాదు, ఆకరికి టీవీ లోవేసినా చూడక్కర్లేదు. టైం దండగ, తలనొప్పి. ఇంకా ఎమన్నా రాయాలన్న చిరాగ్గానే ఉంది.

20100807

డాన్ శీను - సమీక్ష


కె అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్ ఆర్ మూవీ మేకేర్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్సకత్వం లో "మాస్ రాజ" రవి తేజ, శ్రేయ, "రియల్ స్టార్" శ్రీహరి, షాయాజీ షిండే, మహేష్ మంజ్రేకర్, అంజన, బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్ ప్రధాన తారాగణంగ విడుడైలైన చిత్రం "డాన్ శీను"

కథ
ఆమితభ్ భాచన్ నటించిన "డాన్" చిత్రం ప్రభావం వలన శీను(రవి తేజ) చిన్నపాటి నుంచి "డాన్ శీను" గా పిలిపించుకునే వాడు. డాన్ అవ్వడం ఒకటే శీను లక్ష్యం. అందుకే హైదరాబాద్ కి వస్తాడు. తను గుర్తింపు తెచ్చుకోడానికి డాన్(మనోజ్ మంజ్రేకర్) కొడుకుని కొడతాడు. దాంతో నర్సింగ్(శ్రీహరి) శీను ని చంపడానికి చూస్తాడు. ఇంతలో నర్సింగ్ ప్రత్యర్ది అయిన మాచిరాజు(షాయాజీ) గ్యాంగ్ లో చేరతాడు. మాచిరాజు ప్రతి విషయం లో నర్సింగ్(శ్రీహరి) తో పోటీ పడతుంటాడు. 

ఇంతలో మాచిరాజు శీను ని జర్మనీ పంపిస్తాడు. అక్కడ దీప్తి(శ్రేయ)ని తనని ప్రేమించేలా చేసుకోమంటాడు. శీను అలాగే దీప్తి ప్రేమని సాధించుకుంటాడు. తరవాత కథలో మలుపు తిరగడం తో ఎదురయిన పరిణామాలు ఏమిటి అన్దేదే మిగతా కథ.

చిత్రానికి రవితేజ నటన, ఆలీ, వేణు మాధవ్, బ్రహ్మానందం పందిన్చిద్న హాస్యం, శ్రేయ అందం, బలాలు. మని శర్మ అందించిన బాక్గ్రౌండ్ సంగీతం బాగుంది. ఛాయాగ్రహణం, కూర్పు బావున్నాయి. దర్శకుడు కథ పాతదే అయిన, తెరకెక్కించిన పద్ధతి బాగుంది. మిగతా నటీ నటులకు పెద్దగ ఏమి లేదు.

చిత్రం కథ కొంచెం బుజ్జిగాడు, డీ ని పోలి ఉంది. చిత్రంలో చివరి ఫైటుకి నవ్వని వారు లేరు  హాల్ లో :P

చిత్రానికి నా మూలం :3/5

20100803

నా సైకిల్ ని ఎవరో కిడ్నాప్ చేసారు :(


ఈ  చిత్రం లో ఉన్న సైకిల్ ని ఆదివారం రాత్రి ఎవరో గుర్తు తెలియని ఆగంతుకులు కిడ్నాప్ చేసారు. కాలుష్య నివారణకు నా వంతు సాయం చేద్దాం అనుకుని, ఎంతో ముచ్చట పడి రోజు ఆఫీసుకి నా సైకిల్ మీద వెళ్ళేవాడిని. నన్ను చూఇసి మా మేనేజర్ తో సహా పలువురు సైకిల్ మీద ఆఫీసుకి రావడం మొదలెట్టారు.ఇలాంటి సమయం లో నా సైకిల్ ని కిడ్నాప్ చేయడం ఏ మాత్రం న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నాను.

నా సైకిల్ ని కిడ్నాప్ చేసిన విషయం దేగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాను. వారు నా సైకిల్ ని కిడ్నాప్ చేసిన వాళ్ళను ఎలా అయిన పట్టుకుని నా సైకిల్ ని నాకు తిరిగి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు  కిడ్నాప్ చేయబడిన సైకిల్ ని కనిపెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. కిడ్నాప్ చేయబడ్డ ప్రదేశానికి వచ్చి ఆగంతకుల గురించి ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమో అని ప్రత్యేక "clues టీం"ని రంగం లోకి దింపారు.

నన్ను ఇంచక్కా రొజూ ఆఫీసుకి తీసుకు వెళ్ళే సైకిల్ ఒక్కసారిగా కనిపించకపోయే సరికి ఆఫీసుకి  వెల్ల బుద్ది కావడం లేదు. నా సైకిల్ ని అపహరించినవారు వారి కోర్కెలను ఇంకా తెలియబరచలేదు. వారి కోరికెలు సంన్యసమైనవి ఐతేయ్ తీర్చడానికి నేను తర్యారు గా ఉన్నావు. వారి పైన ఏ పోలీసు కేసు  లేకుండా కేసు వాపసు తీసుకుంటానని, నా సైకిల్ నాకు తిరిగి అప్పగిస్తేయ్ చాలని మనవి చేసుకుంటున్నాను :(