20150513

నా చిట్టి కన్నయ్య...

నువ్వు పుట్టిన క్షణం,
నువ్వు తీసిన మొదటి కూనిరాగం,
నా కంట తిరిన నీరు,
నిన్నే జరిగ్నట్టుంది....కన్నయ్యా!

అప్పుడే రోజులు వారాలు,
వారాలు నెలలు,
నెలలు వర్షాలయ్యయి...కన్నయ్యా!

నువ్వు చెసే ప్రతీ కొత్త పని,
నా కంట అదే నీరు...కన్నయ్యా!

నువ్వు త్వరగా పెద్దొడివైపొతున్నవ్,
నాకెంటో చాలా చాలా త్వరగా అయిపొతున్నట్టుంది...కన్నయ్యా!

నీ అమాయకత్వం, 
ఇంకొన్నాళ్ళేనని భయం కాబోసు...కన్నయ్యా!

ఎన్ని వర్షాలు గడిచినా,
ఒక్కటి మాత్రం నిజం...కన్నయ్యా!

నువ్వు నా చిట్టి కన్నయ్యవే....

20120128

చలిలో వెన్నెల!!


వేళ  కాని వేళలో చలిలో వెన్నెలలో
ఒంటరినై ఉన్నా వలపుల ఊయలలో
చిరుజల్లులలోనా, వెచ్చని ఊహలున్నై
తుంటరి కొరికేదో  రేగింది మనసులో
నీ తలపు రాగానే వేడెక్కి పొతున్నా
బుల్లెమ్మ చెంత చెరాలనే ఆత్రము :) 
ఎందుకే వెన్నెల, చలిలో నీ ఆటలు
నీకిది న్యయమేన? ఓ చలిలో వెన్నెల!!
సమాధానం కావలి నాకు ఈవేళ   

 

20120113

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

ఇంటికి  వచ్చే కొత్త పంటలు
ఇంటి ముంగిళ్ళలో రంగావల్లులు
ముద్ద గొబ్బెమ్మలు
వెచ్చని బోగి మంటలు
హరిదాసు పాటలు
లంగా వోనిల్లో అమ్మయిలు
ఆనందంలో కొత్త జంటలు
కమ్మని పిండి వంటలు
కోడి పందాలు
పేకాట సంబరాలు
రంగుల గాలి పటాలు

ఇంకా ఎన్నెన్నో....


అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు :)

20111025

బంగారు బుల్లెమ్మా



ఓ బుల్లెమ్మా,
కనులు తెరిస్తే, నువ్వు నవ్వితే నీ బుగ్గన పడే సొట్టలే
కనులు మూస్తే నీ నల్లని కురులు, చేక్కిల్లు, నీ కన్నులే
నిను చేరాలనే కోరికే పెరుగుతుంది ఓ లావాలా లోలోపల
అనచాలనే ఆలోచనలో పడుతున్న ఇబ్బంది వెలుపల
నీ స్వరం వినిపించే నా సెల్ ఫోన్ రింగు కోసం కాచుకు కూర్చున్నా
నువ్వు తిట్టే తిట్లకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా
కలలో నువ్వు వేసే మొట్టికాయల కోసమే నిదురిస్తున్నా
నీకోసం ఓ పాటే పాడాలని,
నీకన్నుల్లో ఓ నవ్వె చూడాలని
నీ చెవిలో ఉఫ్ఫ్మని ఊదాలని
నీ చేతికి గాజులే తొడగాలని
నీ మెప్పు కోసం ఎన్నో ఎన్నెన్నో చేయాలని నా మనసే ఆత్ర పడుతుంది,  బంగారం....

20111012

నువ్విలా పాటలు డౌన్లోడ్

ఇక్కడ నేను పైరేటెడ్ పాటలు డౌన్లోడ్ చేసుకోమని లంకె ఇవ్వడం లేదు.


నాకు ఎప్పట్నుంచో ఉన్న ఐడియా ని ఇలా ఉషాకిరణ్ మూవీస్ వారికి కూడా వచ్చినందుకు ఆనన్దపదుతూ ఈ టపా వేస్తున్నాను.

నేను హైదరాబాదులో ఉండగా, పాటల సీడీని కొని పాటలు రిప్ చేసుకునే వాడిని. బెంగుళూరు వచ్చిన తరవాత కొనే చోటు దొరికేది కాదు. ఇంకా రాగ డాట్ కాం లో వినేవాడిని. కొన్ని డౌన్లోడ్ చేసుకునే వాడిని వేరే సౌర్చెస్ నుంచి. అపుడప్పుడు అనుకున్తూ ఉండే వాడిని, సినిమా పాటలు విడుదల చేసినప్పుడు పాటకి రూపాయో రెండు రూపాయలో ఖరీదు పెట్టి, డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కలిగించి ఉంటే బాగుంటుంది కదా, ఇలా పైరేట్ చేయడం తగ్గుతుంది అనుకునే వాడిని. ఇన్నాళ్ళకు ఉష కిరణ్ మూవీస్ వారు, నువ్విల పాటలు అన్నిటిని ఇరవై రూపాయలకి డౌన్లోడ్ చేసుకునే వీలును కలిపించినందుకు ఆనందపడుతూ డౌన్లోడ్ చేసుకున్నాను.


ఈ పాటలని నువ్విలా సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

20110910

ఫ్రెండు పెళ్ళి రెసెప్షను - అమ్మాయి - కారు లిఫ్టు


ఈ రోజు మా కొలీగ్ రిసెప్షన్ కి వెళ్ళాను. రిసెప్షన్లో పెళ్లికొడుక్కిన్ను, పెళ్లికుతిరికిన్ను  అప్పటికే ఎవరో ఇచ్చిన గిఫ్ట్నివాళ్ళు అందుకుని పక్కన పారేయగా, తెలివగా వాటిలోంచి పెద్ద సైజు గిఫ్ట్ ఒకటి చాకచక్యంగా తీసుకొచ్చి, నేనే ఇస్తున్నట్టు ఇచ్చి, శుభాకాంక్షలు చెప్పేసి, అసలా వెళ్ళిన పని మీద పడ్డం అందరం( అదేనండి తిండి కార్యక్రమం ఉంటుంది కదా J)  
అక్కడ మా ఫ్రెండ్కి ఒక అమ్మాయి నచిందని చెప్పాడు. వెళ్లి మాటాడు అని ఓ కరీదైన సలహాతో కొట్టా. మా వాడు దానికి సిగ్గుపడో, బయపడో కదల్లేదు మాదేగ్గర్నుంచి. నువ్వు వెళ్లి పరిచయం చేసుకో చూద్దాం అని నాకు రివర్స్లో ఒక చురుకు వేసాడు( నన్ను తక్కువ అంచనా వేసి J )
సరే అని తింటున్న ప్లేట్తోపాటు ఆ అమ్మాయి ఉన్న చోటకి వెళ్లి కుర్చుని, మాట్లాడ్డం మొదలెట్టా. మా వాడికి మీరు నచ్చారట, వచ్చి మాట్లాడడానికి సిగ్గు పడుతున్నాడు, పిలవమండురా అని అడిగా. ఆ పిల్ల్లెంమో నాకు కరెంటు షాక్ కొట్టేట్టు ఒక జవాబు ఇచింది.  “Oh!  Is it. Does he want to talk in public or private” అని అంది.
ప్రైవేటుగా మాట్లాడ్డం ఓకే నే కాని ఈ సారికి పబ్లిక్గానే మాట్లాడండి అని చెప్పా. సరే అంది.
మా వాళ్ళు అక్కడ షాక్ కొట్టిన కాకుల్లా, నిలబడి చూస్తున్నారు. రండి అని ఒక సైగ చేసి పిలిస్తే తుర్రుమన్నారు అక్కడనుంచి. ఏంటి మీ వాళ్ళు అలా తుర్రుమన్నారు అని నన్ను ప్రశ్నించగా, ఏమో కనుక్కుంటా వెళ్లి అని అంటే, నువ్వు కుడా జారుకుందాం అనా అని ఒక ప్రశ్నతో పిచ్చకోత్తుడు కొట్టినట్టు వదిలింది నా మీదకి.  అదేమీలేదు అన్నాను. నేను రానా పోనీ, వచ్చి మాట్లాడానా అంది. సరే అన్నాను. ముందు మీ వాళ్ళని వెతుక్కోండి ఎక్కడున్నారో అంది. అదీ నిజమే అని వాళ్ళని వెతికి పట్టుకుంటే, అల ఎలా మాట్లదేస్తావ్ అబ్బి, ఏదో సరదాకి అంటే నిజంగానే చేసేస్తావ అని నా గురించి తెలుసుకుని ఆ షాక్ నుంచి తెరుకున్నకా, బయల్దేరి వస్తుంటే, వర్షం మొదలు. ఫంక్షన్ హాలు వాకిట్లో నున్చిని వర్షం ఎప్పుడు తగ్గుద్డా అని చూస్తుంటే, వెనక నుండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు అంది. మరతహళ్లి అంటే, నేను అటే డ్రాప్ లిఫ్ట్ ఇస్తాను పదండి అని అంది. మేము ఏమనుకుంటుందో అని కూడా పట్టించుకోకుండా, నేను డ్రైవ్ చేయనా అని అడిగేసా. ఈసారికి నేను నడుపుతా, లైట్ తీసుకో అని మా స్టాప్ దెగ్గర ఆపింది. దిగి నెంబర్ అడగ్గా, ఒక నవ్వు విసరి తుర్రుమంది.

20110725

నేను ఇటీవలే తీసిన చాయాచిత్రాలు..

నేను ఇటీవలే తీసిన చాయాచిత్రాలు...అందరికి చుపెడదామని ఇలా ఇక్కడ వేస్తున్న :)