20101008

'మహేష్' ఖలేజ - సమీక్ష


శ్రీ కనకరత్న మూవీస్ పతాకం పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వం లో మహేష్ బాబు, అనుష్క, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, రావు రమేష్, షఫీ, సుబ్బరాజు, సునీల్, అలీ ప్రదాన తారాగణంగా సింగనమల రమేష్, C కళ్యాణ్ నిర్మించిన చిత్రం 'మహేష్' ఖలేజ. 

దేవ మనుష్య రూపేన మీద ఆధార పడిన కథ ఇది. రావు రమేష్, వారి గ్రామం ని కాపాడే దేవుడుని వెతికి తీసుకు రమ్మని షఫీ నీ పంపిస్తాడు.  అవసరంలో సాయం అడిగిన వారికి సాయం చెయ్యడమే దైవం అని చెప్పడమే ఈ చిత్రం ముక్య ఉద్దేశం. కథలోకి వస్తే, సీతా రామ రాజు(మహేష్) టాక్సీ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. ఎవరికో ఇన్సురంచ్స్ డబ్బు ఇవ్వడానికి రాజస్తాన్ వెళ్తాడు. అక్కడ జెమిని టీవీ కి ఓ కార్యక్రమం చేయడానికి వచ్చిన సునీల్ ని కలుస్తాడు. తను రాజస్తాన్ ఎందుకు రావలసి వచ్చిందో, సుభాషిని(అనుష్క) ప్రమేయం ఏంటో చెప్తూ ఉంటాడు. ఈలోపు అనుష్క ఆ రాజస్తాన్ లో వాళ్ళకి కనబడుతుంది. ఆ ఎడారిలో వారు ఆ ఇన్సురన్సు చెక్కు ఇచేసిన తరవాత జీ.కే(ప్రకాష్ రాజ్) మనుషులు రాజు ని దాడి చేస్తారు.  దాడి చేసిన తరవాత రాజు వల్ల మీద తిరగబడతాడు. అప్పుడు షఫీ కి రావు రమేష్ చెప్పిన గుర్తులు రాజులో కనబడి తనని వారి గ్రామానికి తీసుకు వెళ్లి వైద్యం చేస్తారు. తరవాత వారి గ్రామాన్ని ఎలా కపాడుతాడో, అన్నదే మిగతా కథ. 

విశ్లేషణ: 

మహేష్  చాల బాగా నటించాడు. హాస్యాన్ని చాల బాగా పండించాడు. త్రివిక్రమ్ మాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ చాల బావుంది. అనుష్క తన పాత్రని బానే పోషించిందని చెప్పాలి. రావు రమేష్ బా చేసాడు. సునీల్, అలీ, బ్రహ్మానందం నవ్వులు బాగా పండించారు. 

నేను చిత్రానికి ఇచే మూలం : 3.2/5