20100904

గాయం-2 సమీక్ష

 కర్త క్రియేషన్స్ పాతకం పై, రామ్ గోపాల్ వర్మ సమర్పణలో, జగపతి బాబు, విమల రామన్, కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి, కోట ప్రసాద్, హర్ష వర్ధన్, ప్రధాన తారాగణంగా ప్రవీణ్ శ్రీ దర్సకత్వంలో   Dr. C ధర్మకర్త  నిర్మించిన చిత్రం గాయం-2.

     17 సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మ దర్సకత్వం లో వచ్చిన గాయం చిత్రానికి ఇది శేషము. 

కథ: 
     రామ్(జగపతి బాబు) బాంగ్-కాక్ లో కాఫీ షాప్ ఓనరు. తన భార్య విద్య(విమల), కొడుకు కార్తీక్, అమాయకపు బావమరిది(హర్ష వర్ధన్) తో సంతోషంగా జీవిస్తుంటాడు.  అనుకోని పరిస్థితుల్లో తన కాఫీ షాప్లో ఇద్దరి వ్యక్తులని కాల్చి చంపుతాడు రామ్. ఈ సంఘటన న్యూస్ ఛానల్ లో చూసి రామ్ 'దుర్గ' ఏమో అన్న అనుమానంతో గురు నారాయణ(కోట శ్రీనివాస రావు) కొడుకు  శంకర్ నారాయణ(కోట ప్రసాద్), తన లాయరు (తనికెళ్ళ భరణి) బాంగ్-కాక్ వస్తారు. శంకర్ నారాయణ ఇంకా లాయరు అనేక రకాలుగా రామ్ 'దుర్గ' అవునో కాదో తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. రామ్ వల్ల పాత శత్రువు 'దుర్గ' అవునా కాదా, తరువాత ఎం జరిగిందనేది మిగతా కథ.

విశ్లేషణ: 
     జగపతి బాబు గాయం సినిమాలో లాగే బాగా చేసాడు. కోట శ్రీనివాస రావు తెలంగాణా యాసతో చాల బాగా చేసారు.  తనికెళ్ళ భరణి కూడా తన పాత్రని చాల బాగా పోషించారు. కోట ప్రసాద్ నటన బావుంది. దురదృష్ట వశాత్తు రోడ్డు ప్రమాదం లో మరణించిన విషయం తెలిసినదే. జీవ, అజయ్, నగేష్,  విమల రామన్, హర్ష వర్ధన్ వారి పత్రాలను బాగా పోషించారు. మిగతా వారు అల తేర మీదకి వచ్చి వెళ్ళిపోతారు. 17 సంవత్సరాల తరవాత కూడా గాయం సినిమా అందరికి గుర్తుంది.  తెరమీదకి ఆ పాత క్లిప్స్ వచ్చినప్పుడు ఈలలు వేసారు ప్రేక్షకులు, చూడచక్కగా బాగుంది. కథ తెలిసిందే కాబట్టి కొత్తగా  ఏమి  అనిపించలేదు. గాయం మొదటి బాగానికి ఈ బాగాన్ని చక్కగా పొడిగించాడు దర్శకుడు. 

ఇలయ రాజ నేపధ్య సంగీతం బాగుంది. పాటలు పరవాలేదు. అనిల్ కేమెర పనితనం బాగుంది. ఎడిటింగ్ ప్రవీణ్ చాల బాగా చేసారు. వస్త్రాలంకరణ బాగుంది.

మొత్తానికి సినిమా బాగుందని చెప్పొచు. గాయం - 2 కి నా మూలము 3.5/5