20100730

బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం - సమీక్ష


 రాజేంద్ర ప్రసాద్, శివాజీ, జయప్రకాశ్ రెడ్డి, సోనియా ప్రదాన తారాగణంగా లక్కీ మీడియా వారి నిర్మాణం లో గొల్లపాటి నాగేశ్వరరావు దర్సకత్వం లో విడుదలైన చిత్రం 'బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం'.




కథ 

బ్రహ్మ (రాజేంద్ర ప్రసాద్) , సరస్వతి దేవి(కళ్యాణి) తో గొడవ పది చిరాకు లో ఒకరి తలరాత వివాహమైన మరుక్షణం మరణం అని రాసి వదిలేస్తారు.


కొన్ని సంవత్సరాల తరవాత, శ్రీను (శివాజీ) డిగ్రీ పాస్ అవ్వడానికి కస్తపదుథూ ఉంటాడు. శ్వేత(సోనియా) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. శ్రీను స్నేహితుడైన శోభన్ బాబు (వేణు మాధవ్) తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి మనుషుల తలరాత చదివే వరం కావాలని కోరుకుంటాడు. బ్రహ్మ ఒక చెంబు తో పాలు ప్రసాదించి, అవి తాగితేయ్ ఆ శక్తీ తనకి వస్తుందని, కాకపోతే ఏమి చేస్తేయ్ ఆ శక్తీ పోతుందో చెప్పి మయమవుతాడు. ఇంతలో ఆ పాలు శ్రీను తాగేస్తాడు.తరవాత అలాగే శ్వేత ప్రేమను సాధించుకుంటాడు శ్రీను. ఈ శక్తీ వల్ల తలెత్తే సమస్యలు తెలుసుకుని బ్రహ్మ, యమధర్మరాజు(జయప్రకాష్ రెడ్డి) చిత్రగుప్త(A V S )ల తో భూలోకానికి వస్తారు. తను ఇచిన శక్తిని తిరిగి తీసుకోవడం లో విజయం సాధించార లేదా అన్నదే మిగిలిన కథ.

*********************

రాజేంద్ర ప్రసాద్ చాల కాలం తరవాత చేసిన చిత్రం. తన పాత్రను బాగా పోషించారు. శివాజీ పరవాలేదు. సోనియా కూడా పరవాలేదనిపించుకుంది. కళ్యాణి, లయ పాత్రలు పేరుకి మాత్రమే. ఆర్తి అగర్వాల్ 'రంభ' పాత్రకి నప్పలేదు. రఘుబాబు, వేణు మాధవ్ అక్కడక్కడ నవ్వులు పండించారు. మిగతావారు వారి పాత్రలు బానే పోషించారు. జయప్రకాష్ రెడ్డి పాత్ర బాగుంది.
*********************
గ్రాఫిక్స్ ఇంకా బాగా చేసి ఉండాల్సింది. పాటల్లో ప్రదేశాలు బాగున్నాయి. సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. కూర్పు, స్క్రీన్ ప్లే  బాగున్నాయి. 

చిత్రానికి నా మూలం : 2.25/5


20100726

మర్యాద రామన్నా - సమీక్ష

                          

ఆర్క మిడియ వర్క్స్ వారి నిర్మానం లొ ఎస్ ఎస్ రాజమౌలి మిగత చిత్రాలకు బిన్నంగా సునిల్ తొ చెసిన సరికొత్త ప్రయత్నం "మర్యాద రామన్న".

కథ

గండికోట, 1982 లో జరిగిన కుటుంబ కలహాల వల్ల రామినీడు తమ్ముడు నాగినీడు చనిపోతాడు. తన తమ్ముడి చావుకి కారణం అయిన కుటుంబం మొత్తం ని అంతం చేయాలనీ తన ఇద్దరి కొడుకులతో ప్రమాణం చేయించుకుంటాడు రామినీడు.

28 సంవత్సరాల తరవాత  హైదరాబాదు, రాము(సునీల్)  తన సైకిల్ మీద పచారి కోట్లకి బియ్యం వేస్తూ ఉంటాడు. ప్రతి సారి ఆలస్యం అవుతుండటం తో మిల్లు యజమాని ఆటో ఉంటె కాని పని ఇవ్వనంటాడు. దాంతో ఉద్యోగం పోయి నిరాశగా ఉన్న రాము(సునీల్) కి  తన స్వగ్రామం అయిన గండికోటలో ఉన్న పొలం గురించి తెలుస్తుంది. అది అమ్మి ఆటో  కొనుక్కుందామని గండికోతకి బయల్దెరతాడు. ఈ క్రమంలో తనకి రామినీడు కూతురు అయిన అపర్ణ(సలోని) పరిచయం అవుతుంది. తన దురదృష్టానికి రాము నగినీడు ని చంపినతని కొడుకు. ఈ విషయం రామినీడు ఇంట్లో ఉండగా వాళ్ళకి తెలుస్తుంది. రామినీడు ఇంట్లో అతిధి ని చంపాను అని, బయటకి అడుగు పెట్టగానే చంపేద్దాం అని కొడుకులతో అంటాడు. రాము బయటకి వచాడ, ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగతా కథ.

చిత్రం లో పాటలు బాగున్నాయి. "తలకిందులు" మరియు "రాయే రాయే" పాటల్లో సునీల్ డాన్సు చాల బాగుంది. బ్యాక్గ్రౌండ్  మ్యూజిక్ లో "ఇన్నాళ్ళకు పెదపండగా వచ్చే" పాట చాల బాగుంది. సునీల్ సైకిల్ కి మాటలు నేర్పిన రవితేజ మాటలు చాల బావున్నాయి. సైకిల్ కూడా ఒక ముఖ్య పాత్రా పోషించింది ఈ చిత్రం లో. బాలసుబ్రహ్మణ్యం  పాడిన "పరుగులు తియ్యి" పాట చాల బాగా వచ్చింది. కథ చివరికి వచ్చే సమయానికి ప్రేక్షకుల్లో ఉత్కంట పెంచుతుంది ఈ పాట. కీరవాణి చక్కటి సంగీతాన్ని అందించారు.

రాజమౌళి తెలివిగా చిత్రం విడుదలకి  ముందే కథ చెప్పేయడం తో చిత్రం మీద అంచనాలు తగ్గించడం లో సఫలిక్రుతుడయ్యడనే   చెప్పాలి . చిత్రం లో ఛాయాగ్రహణం చాల బాగుంది. చిత్రం లో నటీనటులందరూ ఎవరి పాత్రని వాళ్ళు బాగా పోషించారనే చెప్పాలి.

మొత్తం మీద చిత్రానికి నేను ఇచ్చే మూలం 3.5/5