20100807

డాన్ శీను - సమీక్ష


కె అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్ ఆర్ మూవీ మేకేర్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్సకత్వం లో "మాస్ రాజ" రవి తేజ, శ్రేయ, "రియల్ స్టార్" శ్రీహరి, షాయాజీ షిండే, మహేష్ మంజ్రేకర్, అంజన, బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్ ప్రధాన తారాగణంగ విడుడైలైన చిత్రం "డాన్ శీను"

కథ
ఆమితభ్ భాచన్ నటించిన "డాన్" చిత్రం ప్రభావం వలన శీను(రవి తేజ) చిన్నపాటి నుంచి "డాన్ శీను" గా పిలిపించుకునే వాడు. డాన్ అవ్వడం ఒకటే శీను లక్ష్యం. అందుకే హైదరాబాద్ కి వస్తాడు. తను గుర్తింపు తెచ్చుకోడానికి డాన్(మనోజ్ మంజ్రేకర్) కొడుకుని కొడతాడు. దాంతో నర్సింగ్(శ్రీహరి) శీను ని చంపడానికి చూస్తాడు. ఇంతలో నర్సింగ్ ప్రత్యర్ది అయిన మాచిరాజు(షాయాజీ) గ్యాంగ్ లో చేరతాడు. మాచిరాజు ప్రతి విషయం లో నర్సింగ్(శ్రీహరి) తో పోటీ పడతుంటాడు. 

ఇంతలో మాచిరాజు శీను ని జర్మనీ పంపిస్తాడు. అక్కడ దీప్తి(శ్రేయ)ని తనని ప్రేమించేలా చేసుకోమంటాడు. శీను అలాగే దీప్తి ప్రేమని సాధించుకుంటాడు. తరవాత కథలో మలుపు తిరగడం తో ఎదురయిన పరిణామాలు ఏమిటి అన్దేదే మిగతా కథ.

చిత్రానికి రవితేజ నటన, ఆలీ, వేణు మాధవ్, బ్రహ్మానందం పందిన్చిద్న హాస్యం, శ్రేయ అందం, బలాలు. మని శర్మ అందించిన బాక్గ్రౌండ్ సంగీతం బాగుంది. ఛాయాగ్రహణం, కూర్పు బావున్నాయి. దర్శకుడు కథ పాతదే అయిన, తెరకెక్కించిన పద్ధతి బాగుంది. మిగతా నటీ నటులకు పెద్దగ ఏమి లేదు.

చిత్రం కథ కొంచెం బుజ్జిగాడు, డీ ని పోలి ఉంది. చిత్రంలో చివరి ఫైటుకి నవ్వని వారు లేరు  హాల్ లో :P

చిత్రానికి నా మూలం :3/5

1 కామెంట్‌:

  1. డాన్ అవ్వడానికి హైద్రాబాడ్ వస్తాడా? మరి బొంబాయి కదా వెళ్ళాలి. బహుశా అమితాభ్ "డాన్" కాకుండా, యుగంధరో బిల్లానో చూసినట్టున్నాడు.

    రిప్లయితొలగించండి