20100803

నా సైకిల్ ని ఎవరో కిడ్నాప్ చేసారు :(


ఈ  చిత్రం లో ఉన్న సైకిల్ ని ఆదివారం రాత్రి ఎవరో గుర్తు తెలియని ఆగంతుకులు కిడ్నాప్ చేసారు. కాలుష్య నివారణకు నా వంతు సాయం చేద్దాం అనుకుని, ఎంతో ముచ్చట పడి రోజు ఆఫీసుకి నా సైకిల్ మీద వెళ్ళేవాడిని. నన్ను చూఇసి మా మేనేజర్ తో సహా పలువురు సైకిల్ మీద ఆఫీసుకి రావడం మొదలెట్టారు.ఇలాంటి సమయం లో నా సైకిల్ ని కిడ్నాప్ చేయడం ఏ మాత్రం న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నాను.

నా సైకిల్ ని కిడ్నాప్ చేసిన విషయం దేగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాను. వారు నా సైకిల్ ని కిడ్నాప్ చేసిన వాళ్ళను ఎలా అయిన పట్టుకుని నా సైకిల్ ని నాకు తిరిగి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు  కిడ్నాప్ చేయబడిన సైకిల్ ని కనిపెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. కిడ్నాప్ చేయబడ్డ ప్రదేశానికి వచ్చి ఆగంతకుల గురించి ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమో అని ప్రత్యేక "clues టీం"ని రంగం లోకి దింపారు.

నన్ను ఇంచక్కా రొజూ ఆఫీసుకి తీసుకు వెళ్ళే సైకిల్ ఒక్కసారిగా కనిపించకపోయే సరికి ఆఫీసుకి  వెల్ల బుద్ది కావడం లేదు. నా సైకిల్ ని అపహరించినవారు వారి కోర్కెలను ఇంకా తెలియబరచలేదు. వారి కోరికెలు సంన్యసమైనవి ఐతేయ్ తీర్చడానికి నేను తర్యారు గా ఉన్నావు. వారి పైన ఏ పోలీసు కేసు  లేకుండా కేసు వాపసు తీసుకుంటానని, నా సైకిల్ నాకు తిరిగి అప్పగిస్తేయ్ చాలని మనవి చేసుకుంటున్నాను :(





11 కామెంట్‌లు:

  1. అయ్యో పాపం. నేను కూడా ఖండిస్తున్నా ఈ సైక్ల్నాప్ ను. పాపం తాడేసి కట్టలేదా బయట పెట్టినప్పుడు? మీ సైకిల్ త్వ్ర లో తిరిగి రావాలని ప్రత్యేక ప్రార్ధనలు చేయిద్దాం.

    రిప్లయితొలగించండి
  2. ఇంక ఆ సైకిల్ ఫోటోని ఫ్రేంలో పెట్టి, దండేసి దణ్ణం పెట్టుకొండి :P ఆనందంగా కొత్త సైకిల్ కొనుక్కోండి.

    రిప్లయితొలగించండి
  3. @భావన గారు
    చైను వెసి మరి తాలం వెసా అంది, చైను కుద ఎత్తుకు పొయారు

    @Photodummy
    పాపం నా సైకిలు పొతె దండేసి కొత్తది ఎలా కొనమంతారు

    రిప్లయితొలగించండి
  4. పర్లేదులే..., పోయిందెట్లాగు పోయింది.., మొన్న ఒక మాల్ లో ఒక సైకిల్ చూసా రూ38,000/- లే నంట.., కొనెయ్యండది.
    నచ్చక పోతే చెప్పండి.., 6లక్షల రూపాయలు పెట్టి BMW సైకిల్ తెప్పిద్దాం...!!

    రిప్లయితొలగించండి
  5. mee cycle meeku pranalatho kavalante, oka vaaram paatu office ki naDichi vellali... idhi chesina tharuvatha cheptham em cheyyalo...

    రిప్లయితొలగించండి
  6. హ హ హ..... బాబోయ్ నేను మాత్రం కిడ్నాప్ చేయలేదు మీ సైకిల్ ని

    రిప్లయితొలగించండి
  7. @శివరంజని గారు
    మీరే అపహరించారని నా ఆరో తెలివి చెబుతోంది

    రిప్లయితొలగించండి
  8. సైకిలు అపహరించింది నేనే, మీ సైకిలు ప్రాణాలతో ప్రనాల తో కావాలి అనుకుంటే నాకు లక్ష ఇవ్వాలి.. నా ఫోన్ నంబర్: 08942-278374

    రిప్లయితొలగించండి
  9. ఇంతకీ సైకిల్ దొరికిందా లేదా?ఆఫీసు కి డుమ్మా కొట్టడానికి ఇది ప్లాన్ ఏమో అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  10. లేదు, దొరకలేదుగా... :(
    ఆఫీసుకి సైకిల్ కి సంబంధం లేదు. బస్సులో కాని నా బైక్ మీద కాని వెళ్తాను ఆఫీసుకి. వర్షాలు కారణంగాను, ఔటర్ రింగు రోడ్డు పనులు కారణంగాను ప్రస్తుతం మోటారు సైకిల్ మీద వేల్లుచుంటిని. త్వరలో ఇంకో సైకిల్ని కోనాలి.

    నా సైకిల్ ని కిడ్నాప్ చేసిన వాళ్ళు, వేరే రాష్ట్రానికి పరారయినట్టు సమాచారం. పోలీసులు కేసు మూసేసారు. సైకిల్ నాట్ ఫౌంద్ అని. :((

    రిప్లయితొలగించండి