20100730

బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం - సమీక్ష


 రాజేంద్ర ప్రసాద్, శివాజీ, జయప్రకాశ్ రెడ్డి, సోనియా ప్రదాన తారాగణంగా లక్కీ మీడియా వారి నిర్మాణం లో గొల్లపాటి నాగేశ్వరరావు దర్సకత్వం లో విడుదలైన చిత్రం 'బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం'.




కథ 

బ్రహ్మ (రాజేంద్ర ప్రసాద్) , సరస్వతి దేవి(కళ్యాణి) తో గొడవ పది చిరాకు లో ఒకరి తలరాత వివాహమైన మరుక్షణం మరణం అని రాసి వదిలేస్తారు.


కొన్ని సంవత్సరాల తరవాత, శ్రీను (శివాజీ) డిగ్రీ పాస్ అవ్వడానికి కస్తపదుథూ ఉంటాడు. శ్వేత(సోనియా) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. శ్రీను స్నేహితుడైన శోభన్ బాబు (వేణు మాధవ్) తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి మనుషుల తలరాత చదివే వరం కావాలని కోరుకుంటాడు. బ్రహ్మ ఒక చెంబు తో పాలు ప్రసాదించి, అవి తాగితేయ్ ఆ శక్తీ తనకి వస్తుందని, కాకపోతే ఏమి చేస్తేయ్ ఆ శక్తీ పోతుందో చెప్పి మయమవుతాడు. ఇంతలో ఆ పాలు శ్రీను తాగేస్తాడు.తరవాత అలాగే శ్వేత ప్రేమను సాధించుకుంటాడు శ్రీను. ఈ శక్తీ వల్ల తలెత్తే సమస్యలు తెలుసుకుని బ్రహ్మ, యమధర్మరాజు(జయప్రకాష్ రెడ్డి) చిత్రగుప్త(A V S )ల తో భూలోకానికి వస్తారు. తను ఇచిన శక్తిని తిరిగి తీసుకోవడం లో విజయం సాధించార లేదా అన్నదే మిగిలిన కథ.

*********************

రాజేంద్ర ప్రసాద్ చాల కాలం తరవాత చేసిన చిత్రం. తన పాత్రను బాగా పోషించారు. శివాజీ పరవాలేదు. సోనియా కూడా పరవాలేదనిపించుకుంది. కళ్యాణి, లయ పాత్రలు పేరుకి మాత్రమే. ఆర్తి అగర్వాల్ 'రంభ' పాత్రకి నప్పలేదు. రఘుబాబు, వేణు మాధవ్ అక్కడక్కడ నవ్వులు పండించారు. మిగతావారు వారి పాత్రలు బానే పోషించారు. జయప్రకాష్ రెడ్డి పాత్ర బాగుంది.
*********************
గ్రాఫిక్స్ ఇంకా బాగా చేసి ఉండాల్సింది. పాటల్లో ప్రదేశాలు బాగున్నాయి. సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. కూర్పు, స్క్రీన్ ప్లే  బాగున్నాయి. 

చిత్రానికి నా మూలం : 2.25/5


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి