20110910

ఫ్రెండు పెళ్ళి రెసెప్షను - అమ్మాయి - కారు లిఫ్టు


ఈ రోజు మా కొలీగ్ రిసెప్షన్ కి వెళ్ళాను. రిసెప్షన్లో పెళ్లికొడుక్కిన్ను, పెళ్లికుతిరికిన్ను  అప్పటికే ఎవరో ఇచ్చిన గిఫ్ట్నివాళ్ళు అందుకుని పక్కన పారేయగా, తెలివగా వాటిలోంచి పెద్ద సైజు గిఫ్ట్ ఒకటి చాకచక్యంగా తీసుకొచ్చి, నేనే ఇస్తున్నట్టు ఇచ్చి, శుభాకాంక్షలు చెప్పేసి, అసలా వెళ్ళిన పని మీద పడ్డం అందరం( అదేనండి తిండి కార్యక్రమం ఉంటుంది కదా J)  
అక్కడ మా ఫ్రెండ్కి ఒక అమ్మాయి నచిందని చెప్పాడు. వెళ్లి మాటాడు అని ఓ కరీదైన సలహాతో కొట్టా. మా వాడు దానికి సిగ్గుపడో, బయపడో కదల్లేదు మాదేగ్గర్నుంచి. నువ్వు వెళ్లి పరిచయం చేసుకో చూద్దాం అని నాకు రివర్స్లో ఒక చురుకు వేసాడు( నన్ను తక్కువ అంచనా వేసి J )
సరే అని తింటున్న ప్లేట్తోపాటు ఆ అమ్మాయి ఉన్న చోటకి వెళ్లి కుర్చుని, మాట్లాడ్డం మొదలెట్టా. మా వాడికి మీరు నచ్చారట, వచ్చి మాట్లాడడానికి సిగ్గు పడుతున్నాడు, పిలవమండురా అని అడిగా. ఆ పిల్ల్లెంమో నాకు కరెంటు షాక్ కొట్టేట్టు ఒక జవాబు ఇచింది.  “Oh!  Is it. Does he want to talk in public or private” అని అంది.
ప్రైవేటుగా మాట్లాడ్డం ఓకే నే కాని ఈ సారికి పబ్లిక్గానే మాట్లాడండి అని చెప్పా. సరే అంది.
మా వాళ్ళు అక్కడ షాక్ కొట్టిన కాకుల్లా, నిలబడి చూస్తున్నారు. రండి అని ఒక సైగ చేసి పిలిస్తే తుర్రుమన్నారు అక్కడనుంచి. ఏంటి మీ వాళ్ళు అలా తుర్రుమన్నారు అని నన్ను ప్రశ్నించగా, ఏమో కనుక్కుంటా వెళ్లి అని అంటే, నువ్వు కుడా జారుకుందాం అనా అని ఒక ప్రశ్నతో పిచ్చకోత్తుడు కొట్టినట్టు వదిలింది నా మీదకి.  అదేమీలేదు అన్నాను. నేను రానా పోనీ, వచ్చి మాట్లాడానా అంది. సరే అన్నాను. ముందు మీ వాళ్ళని వెతుక్కోండి ఎక్కడున్నారో అంది. అదీ నిజమే అని వాళ్ళని వెతికి పట్టుకుంటే, అల ఎలా మాట్లదేస్తావ్ అబ్బి, ఏదో సరదాకి అంటే నిజంగానే చేసేస్తావ అని నా గురించి తెలుసుకుని ఆ షాక్ నుంచి తెరుకున్నకా, బయల్దేరి వస్తుంటే, వర్షం మొదలు. ఫంక్షన్ హాలు వాకిట్లో నున్చిని వర్షం ఎప్పుడు తగ్గుద్డా అని చూస్తుంటే, వెనక నుండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు అంది. మరతహళ్లి అంటే, నేను అటే డ్రాప్ లిఫ్ట్ ఇస్తాను పదండి అని అంది. మేము ఏమనుకుంటుందో అని కూడా పట్టించుకోకుండా, నేను డ్రైవ్ చేయనా అని అడిగేసా. ఈసారికి నేను నడుపుతా, లైట్ తీసుకో అని మా స్టాప్ దెగ్గర ఆపింది. దిగి నెంబర్ అడగ్గా, ఒక నవ్వు విసరి తుర్రుమంది.

3 కామెంట్‌లు:

  1. హేయ్ ..భలే ఉంది.మరి అమ్మాయిలు అంటే ఏమనుకున్నారు? వంశీ మీ బ్లాగ్..పేరుకు తగినట్లుగా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. వనజ గారు, ఇప్పుడు అమ్మయిల గురుంచి ఏమి అనుకోవాలన్న కస్తామేనండి :)

    బ్లాగ్ నచినందుకు చాల సంతోషంగా ఉంది :)

    రిప్లయితొలగించండి